ప్లాస్టిక్ రహిత.. పరిశుభ్ర పట్టణంగా మార్చాలి-హరీష్‌రావు

324
harish
- Advertisement -

సిద్దిపేట పట్టణానికి వంద ఏళ్ల పునాది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని…సిద్దిపేట పట్టణం పరిశుభ్రంగా చేసే దిశగా మరింత ముందుడగు వేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు..సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ పనుల పురోగతిపై మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పూర్తి అయిన వార్డుల వారిగా సుదీర్గంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఇప్పటి వరకు 15వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ పనులు పూర్తి అయ్యయన్నారు. పూర్తి అయిన వార్డుల్లో ప్రతి ఇంటికి కనెక్షన్‌లు ఇచ్చేలా అవగాహన. ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

ఇప్పటి రెండు వార్డుల్లో నేను అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్ననని.. మిగిలిన వార్డుల్లో ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించారు అని అధికారులను ఆరా తీశారు. కనెక్షన్‌ల విషయంలో ప్రజల్లో మరింత అవగహన కల్పించాలని చెప్పారు. పనులు పూర్తి అయిన ప్రతి వార్డులో కౌన్సిలర్స్ , ఆర్ పి లు ప్రత్యేక చొరవ చూపాలనన్నారు. వార్డుల వారిగా కనెక్షన్లు పై అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్న వార్డులో పరిష్కరించే దిశగా అధికారులు చొరవ చూపాలని చెప్పారు. వచ్చే నెల రోజుల్లో పూర్తి అయిన వార్డుల్లో కనెక్షన్లు పూర్తి చేయాలని కోరారు. ప్రతి వార్డులో పనులపై ఆర్ పి లను అడిగి తెలుసుకున్నారు.

పట్టణంలో 7వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ పనులు వేగంగా పూర్తి అయ్యాయని..అదే స్ఫూర్తితో కనెక్షన్‌లపై కూడా కౌన్సిలర్ చొరవవతో ఎక్కువ శాతం పూర్తి అయ్యయన్నారు..అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ పై 7వ వార్డును ఆదర్శంగా తీసుకొవాలని.. కనెక్షన్లు ఇచ్చిన విధానంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై ఆ వార్డుని సందర్శించాలని కౌన్సిలర్స్ ని ,ఆర్ పి లను హరీష్ రావు కోరారు.

పూర్తి అయిన వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనెజ్ కనెక్షన్‌లు వేగవంతం చేసే దిశగా డి ఈ లక్ష్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసారు. ఇందులో జే ఈ లు, ఏ ఈ లు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్, ఆర్ పిలు , మున్సిపల్ జవాన్లు కమిటీలో ఉంటారు అని ప్రతి రోజు పనులు ముమ్మరంగా చేసే దిశగా పని చేయాలని సూచించారు. ప్రజల్లో మరింత అవగాహన తెచ్చే విధంగా కరపత్రాలు రూపొందించి ప్రతి ఇంటికి చెరవేయాలని. ఈ కరపత్రంలో అండర్ గ్రౌండ్ , మొక్కల పెంపకం , ప్లాస్టిక్ రహిత ,పరిశుభ్రంగా ఉండే విదంగా తయారు చేయాలని చెప్పారు.

- Advertisement -