మే 28న ప్రపంచకప్‌పై నిర్ణయం: ఐసీసీ

332
icc t20 workd cup
- Advertisement -

కరోనా నేపథ్యంలో అన్ని క్రికెట్ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో ఫేమస్ అయిన టీ 20 ప్రపంచకప్‌పై ఈ నెల 28న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ఐసీసీ.

టీ 20 ప్రపంచకప్‌ను ఫిబ్రవరి-మార్చి 2021 కి వాయిదా వేయలేమని అధికారులు తెలిపారు. ఎందు కంటే అప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్ ఉన్నందున ఇది గొప్ప ఆలోచన కాదన్నారు. రెండు ఐసీసీ ఈవెంట్స్ ఘర్షణ పడకూడదని తెలిపారు.

టీ 20 ప్రపంచకప్‌ ఈవెంట్ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుండి నవంబర్ 15 వరకు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 28న జరిగే సమావేశంలో ప్రపంచకప్‌ ఈవెంట్‌తో పాటు అభిమానులు,కొన్ని ఆంక్షలపై చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -