మిస్టర్‌360…మన సూర్య భాయ్‌

378
- Advertisement -

మీరు ఏబీ డివిలియర్స్‌ ను మిస్స్‌ అవుతున్నారా… అయితే ఏం బాధపడకండి. డివిలియర్స్‌ను మించి షాట్ల్ ఆడే వ్యక్తి ఉన్నాడు. మైదానంలో 360డిగ్రీల కోణంతో షాట్ల్ ఆడే వ్యక్తి మన భారత ఆటగాడు అతడే సూర్యకుమార్‌ యాదవ్‌(SKY)అని రిసేంట్‌గా ఐసీసీ స్కైగా పిలువడం మొదలుపెట్టింది.

కానీ మన భారతీయులం మాత్రం సూర్య భాయ్‌… ఈ తరం క్రికెట్‌ అభిమానులకు అంతకుమించిన వినోదాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ఎన్నోసార్లు తన సత్తాను చాటిన సూర్య అంతర్జాతీయ క్రికెట్లోకి ఆలస్యంగా అవకాశం వచ్చిన పతాక స్థాయిలో విధ్వంసంతో దూసుకెళ్తున్నాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20కప్‌ ప్రపంచ కప్‌లో సూర్య విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఆదివారం రోజున జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడిన తీరు చూస్తే డివిలియర్స్‌ను గుర్తుకు తెచ్చాడు.

జింబాబ్వే చిన్న జట్టే కావచ్చు కానీ ఆ జట్టు బౌలర్లు ఎంతో మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. కోహ్లీ, రోహిత్‌ లాంటి మేటి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. వీలైనంత మేర భారత్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అయితే సూర్య రూపంలో వచ్చిన సైక్లోన్‌ దాటికి జింబాబ్వే నీరుగారిపోయింది.

ఆఫ్‌ స్టంప్‌ ఆవల విసిరిన బంతులకు సైతం ముందుకు వంగి, ర్యాంప్‌ స్కూప్ షాట్లతో వికెట్ల వెనుక ఫైన్‌ లెగ్‌లో కళ్లు చెదిరే రీతిలో ఫోర్లు సిక్సర్లు రాబట్టి వారికి దిక్కు తోచకుండా చేసిన విధానంను తాజాగా ఐసీసీ ఇన్‌స్టా వేదికగా అభిమానులకు పంచుకుంది.

ఇవి కూడా చదవండి..

ఆదిపురుష్‌…వాయిదా

రేపు శ్రీవారి ఆలయం మూసివేత..

జింబాబ్వేపై భారత్‌ అలవోక విజయం

 

- Advertisement -