నిరుద్యోగులకు శుభవార్త..

261
ibps
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త. ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. బ్యాంకు పీవో/మేనేజ్‌మెంట్‌ పోస్టులను భర్తీ చేసేందుకు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అలహాబాద్‌ బ్యాంక్‌లో 784, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 965, కెనరా బ్యాంక్‌లో 1200 కార్పొరేషన్‌ బ్యాంక్‌లో 84, యూసీవో బ్యాంక్‌లో 550, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 519 ఖాళీలున్నాయి. ఇటీవలి కాలంలో ఐబీపీఎస్ విడుదల చేసిన పెద్ద నోటిఫికేషన్ ఇదే.

అప్లికేషన్ ఫీజు జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. ఆగస్టు 14 నుంచి అప్లికేషన్‌ స్వీకరిస్తుండగా సెప్టెంబర్‌ 4 చివరి తేదీ. అక్టోబరు 13, 14, 20, 21 తేదీల్లో ప్రిలిమినరీ, నవంబరు 18న మెయిన్‌ పరీక్ష జరుగనున్నాయి. మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూకు వెయిటేజీని 80:20గా నిర్ణయించారు.

- Advertisement -