కేసీఆర్ శకం.. పల్లెల్లో నూతన శోభ

326
kcr review

పంద్రాగస్టు నుంచి పల్లెలను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్ పచ్చదనం పెంచడానికి సలహాలు,సూచనలు ఇవ్వాలని సూచించారు. మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి వ్యూహాన్ని ఖరారు చేయాలన్నారు.

గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చాలన్నారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనే సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

వివాహ, జనన, మరణ ధ్రవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు మరికొన్ని బాధ్యతలను కూడా పంచాయితీలకు అప్పగించాలని సూ చించారు. వదిలేసిన గుంతలు,పాడుబడిన బావులను పూడ్చేయాలన్నారు సీఎం కేసీఆర్. మురికికాల్వల్లో పేరుకుపోయిన పూడికను తీసేసి అన్ని కాల్వలను శుభ్రం చేయాలన్నారు.

Related image

కూలిపోయిన ఇండ్లు, భవనాల శిథిలాలను తొలగించాలన్నారు. గ్రామంలోని అంతర్గత రోడ్లపై గుంతలనుపూడ్చివేయాలి. గుంతల్లో మొరం నింపాలి. రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు పెంచాలన్నారు. గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించి అందుకు తగిన డంప్ యార్డు కోసం స్థలాన్ని సేకరించాలన్నారు. ప్రతీ గ్రామంలో ఒక స్మశాన వాటికను నిర్మించాలన్నారు.రైతులు పొలం గట్ల మీద, బావుల దగ్గర మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి.గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలో కూడా మొక్కలు పెంచాలని…గ్రామ పరిధిలోని నదులు, ఉప నదులు, కాల్వలు, చెరువుల గట్లపై మొక్కలు నాటాలన్నారు.
Image result for kcr villages