తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన iBOMMA పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్టుకు దారి తీసిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అతడిని పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ పోలీసులు పకడ్బందీగా వేసిన వ్యూహం కీలకంగా పనిచేసింది.దర్యాప్తులో భాగంగా, రవి ఇన్ఫోటెక్ సంస్థ పేరుతో వివిధ డొమైన్లను కొనుగోలు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఆ డొమైన్లకు అనుగుణంగా ఉన్న ఫోన్ నంబర్‌పై పోలీసులు నిశితంగా నిఘా పెట్టారు.రవి సాధారణంగా విదేశాల్లో ఉంటూ, అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి, తన స్నేహితులతో కలిసి రహస్యంగా పార్టీలు చేసుకుంటాడని పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగానే అతడి కదలికలపై పట్టు సాధించారు.ఈ క్రమంలోనే, ఇటీవల ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రవి… “మామా.. హైదరాబాద్ వచ్చా.. కలుద్దాం” అంటూ తన స్నేహితుడికి మెసేజ్ పంపాడు.
అప్పటికే రవి ఫోన్ నంబర్‌పై నిఘా ఉంచిన పోలీసులు, అతడు మెసేజ్ పంపిన లొకేషన్‌ను, హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని వెంటనే నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత వేగంగా రంగంలోకి దిగి, ఎవరికీ అనుమానం రాకుండా రవిని అదుపులోకి తీసుకున్నారు. రవిపై ఇప్పటికే ఫోర్జరీతో సహా మొత్తం 13 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ మెసేజ్ ఆధారంగానే అతడి అరెస్ట్ సులభమైందని పోలీసులు తెలిపారు.
Also Read:రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

