మొక్కలు నాటిన ఐ ఏ ఎస్ ఉదయ్ కుమార్

138
ramagundam

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు తన అధికార నివాసం లో మొక్కలు నాటిన ఉదయ్ కుమార్ ఐఏఎస్.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు . గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజవంతంగా కొనసాగుతుంది . అన్ని వర్గాల ప్రముఖులను భాగస్వామ్యం మొక్కల పెంపకం పైన , వాటిని నాటిన తరువాత ఎదిగె వరకు తీసుకునే బాధ్యతను ప్రజల్లో మంచి అవగాహనా కల్పిస్తున్నారు .

రామగుండము ప్రాంతాల్లో బొగ్గు గనులతో అనునిత్యం ఎండా తీవ్రత ఎక్కువగా ఉంటుంది . ఇక్కడ ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ ని ఛాలెంజ్ తీసుకుకొని ప్రతి ఒక్కరు విధిగా మూడు మొక్కలు నాటి వాటిని ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు . ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురుకి సత్యనారాయణ గారు సిపి రామగుండము , ప్రియాంక అలా అడిషనల్ కమిషనర్ రెవిన్యూ GHMC , సంతోష్ బడవత్ అడిషనల్ కమిషనర్ హెల్త్ GHMC గార్లకి ఛాలెంజ్ చేశారు.