కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.2009 బ్యాచ్‌కు చెందిన రోహిణి ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో జన్మించారు. రోహిణి సింధూరి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.
నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న రోహిణి.. ప్రస్తుతం కర్ణాటకలోని హసన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.ముక్కుసూటిగా వెళ్తారనే పేరున్న ఆమె.. తన సర్వీసులో అనేక సార్లు బదిలీ అయ్యారు.ఒకసారి ఎన్నికల కమిషన్, మరోసారి హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె బదిలీలకు బ్రేక్ పడింది.
రోహిణి లో నిజాయితీతో కూడిన క్రమశిక్షణ అలవడడానికి గల ప్రధాన కారణం అమ్మ శ్రీలక్ష్మీ . దాదాపు 30 సంవత్సరాలుగా అమ్మ సేవారంగంలో ఉంటూ సమాజానికి ఆత్మీయతంగా ఎంతో సేవ చేసేవారు. రోహిణి అమ్మ నాన్నలు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగం, ఉన్నత జీవితం కోసం అమెరికా పంపాలని ఆశించారు.కాని కలెక్టర్ కావాలనే ఆమె ఆశయంతో ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నారు.
హాసన్ జిల్లా నుంచి రోహిణిని ట్రాన్స్ ఫర్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు అక్కడి మంత్రులు. ఐతే హసన్ జిల్లా నుండి రోహిణి వెళ్ళితే మళ్ళి పాత పరిస్థితులే వస్తాయని భావించిన అక్కడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి రోహిణి ని ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలులేదంటూ ధర్నాలు చేశారు.