అన్నీ తిప్పింది….ఆ టైప్‌ కాదంటోంది..

218
iam not that type says pranitha
- Advertisement -

బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది హీరోయిన్ ప్రణీత. కానీ ఈ అమ్మడు ఏది తిప్పినా ఆఫర్లు మాత్రం ప్రణీత చుట్టు తిరగలేకపోతున్నాయి.

టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్ కావాలన్న ప్రణిత కోరిక ఇప్పటి వరకూ తీరలేదు. ఈ బాపు బొమ్మ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో న‌టించినా.. తెలుగులో ఆఫర్లు మాత్రం రాబట్టుకోలేకపోయింది.

 iam not that type says pranitha

ఇదిలా ఉంటే..తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా అయితే ఉంది. ఈ క్రమంలో తన అలవాట్ల గురించి ప్రణీత స్పందించింది. ఈ మధ్య కాలంలో కొంతమంది సినీస్టార్స్‌ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణీత మాట్లాడుతూ… తనకు పార్టీలకు వెళ్లే అలవాటు కానీ, పబ్ లకు వెళ్లి చిందులేసే అలవాలు కానీ లేదని మొత్తానికి తను పార్టీలకు వెళ్ళే టైపు కాదని స్పష్టం చేసింది.

అలాగే సినిమా వాళ్లతో తను పెద్దగా స్నేహంగా కూడా ఉండను అని ప్రణీత చెప్పుకొచ్చింది. తన స్నేహమంతా తన కాలేజీ ఫ్రెండ్స్ తోనే అని ప్రణీత చెప్పింది. ఖాళీ సమయాల్లో కాలేజీ ఫ్రెండ్స్ తోనే గడుపుతానని చెప్పింది. మరి ఒకవైపు ఇండస్ట్రీలో ఉంటూనే, ఇండస్ట్రీలోని వ్యక్తులతో తనకు పెద్దగా స్నేహం లేదని ప్రణీత స్పష్టం చేయడం విశేషం.

iam not that type says pranitha

అంతేకాకుండా ప్రస్తుతానికి చేస్తున్న సినిమాలతో హ్యాపీ అని, పెద్ద పెద్ద కోరికలు లేవని ప్రణీత చెప్పింది. గ్లామరస్ రోల్స్ లో కనిపించడంపై స్పందిస్తూ.. తనకు దొరికిన పాత్రలకు తగ్గట్టుగా నటిస్తున్నానంది. భవిష్యత్తులో హోటల్ వ్యాపారంలోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్టుగా కూడా వివరించింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -