జిందం సత్తమ్మకు విరాభిమానిని : మంత్రి కేటీఆర్‌

26
ktr zindam
- Advertisement -

రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో చీర్లవంచకు చెందిన జిందం సత్తమ్మ గురించి ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రశంసపూర్వక వాఖ్యలు రాశారు. ఆమెతో ఉద్యమ సమయంలోను, స్వరాష్ట్రంలో మంత్రిగా వివిధ సందర్భాలలో కలిసిన ఫోటోలను జత చేశారు. తెలంగాణ ఉద్యమంలో సత్తమ్మ చేసిన పోరాటం, ఉద్యమ భావజాల వ్యాప్తికి చేసిన కృషిని గుర్తుపెట్టుకుని మరి ప్రత్యేకంగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రశంసించారు. కేటీఆర్ మంచి మనసుకు, అభిమానుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అభిమానులు అంటున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్ల వంచ గ్రామానికి చెందిన మహిళే జిందం సత్తమ్మ. తెలంగాణ ఉద్యమంలో అమె చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ కు కరుడు గట్టిన అభిమాని గాను, కేటీఆర్ అంటే ప్రాణంగా ఇష్టపడతుంది. చదువుకోక పోయినా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రసంగాలు విని , సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ను తెలుసుకుని ఉద్యమ బాట పట్టింది. అవహేళనలు ఎదురైన చుట్టూ ఉన్న ప్రజల్లో ఉద్యమ భావ జాల వ్యాప్తికి కృషి చేసింది.మంత్రి కేటీఆర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతి సారీ అన్ని కార్యక్రమాలకు హాజరువుతుంది. జై తెలంగాణ అంటూ నినదిస్తూ కేటీఆర్‌ సభలకు హాజరవుతున్నారు. సిరిసిల్ల శాసన నియోజవర్గ ఎన్నికల్లో కేటీఆర్ 2009 నుండి మొదటిసారి పోటీకి దిగడంతో అప్పటి నుండి ఇప్పటి వరకూ కేటీఆర్‌కు గట్టి మద్దతు దారుగా వెన్నంటే ఉంటూ వస్తున్నారు.

- Advertisement -