పాక్‌కు భారత్ ఆల్టీమేటం…దాడులు తప్పవు!

253
iaf balakot
- Advertisement -

ఉగ్రవాదంపై పాక్ తీరు మారలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్‌కు తీరు మారకుంటే బాలాకోట్ తరహా దాడులు తప్పవని హెచ్చరించారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏ సమయంలోనైనా దాడులు తప్పవని అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుందని,కంటితుడుపు చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఉగ్రవాద సంస్థల అధినేతలను గృహ‌నిర్బంధం చేయడమంటే, వారికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడమేనని అన్నారు. వీరిని విడుదల చేసిన తర్వాత పరిస్థితి యధావిధిగా ఉంటుందని అన్నారు.

ఆత్మరక్షణ హక్కు భారత్‌కు ఉందని, ఇందులో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి విజయవంతంగా వైమానిక దాడులు చేశామని అన్నారు. ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని, కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి చేశామని అధికారులు స్పష్టం చేశారు.

ఉగ్రవాదులకు స్వర్గంగా మారిన పాక్ భూభాగంలో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటిలో మసూద్ అజార్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ శిబిరాలు తొమ్మిది ఉన్నాయని అధికారులువెల్లడించారు. వీటిపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన పాకిస్థాన్ పై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని  సూచించారు.

- Advertisement -