నేను పవన్‌కళ్యాన్‌ వీరాభిమానిని…..

275
I like Pawan Kalyan
- Advertisement -

వంగవీటి రాధా హత్యతో మొదలైన విజయవాడ రౌడీ రాజకీయ చరిత్ర వంగవీటి మోహనరంగా హత్యతో ఎలా ముగిసిందనేది ‘వంగవీటి’చిత్రకథ’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ‘వంగవీటి’నేడు తెలుగు రాష్ట్రల్లో రిలీజ్‌అయ్యిన సందర్భంగా వర్మ మీడియాతో ముచ్చటించారు.

మీడియాతో వర్మచెప్పిన విశేషాలు…..

వంగవీటి కుటుంబంలో రాధా, రంగా, దేవినేని కుటుంబంలో గాంధీ, మురళి… చనిపోయారు. వాళ్లను ఎలా చంపారు? చంపడానికి ప్రేరేపించిన ఘటనలు ఏంటి? అనేవి చిత్రంలో చూపించాను. ఓ గ్రూప్‌గా ఉన్న వీళ్లంతా వేరుపడిన సందర్భాలు చూసి బాధ కలుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

విజయవాడలోని రెండు బలమైన సామాజిక వర్గాల్లో ఏ ఒక్క వర్గానికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా తీసిన చిత్రమిది. అందువల్ల, ఎవరి మనోభావాలూ దెబ్బ తినే అవకాశం లేదనుకుంటున్నా! నేను ఏ వర్గానికీ చెందిన వ్యక్తిని కాదు. ‘వంగవీటి రాధా అనే రౌడీని చంపే శారు’ అని మా చినమావయ్య చెప్పారు. అప్పుడు రాధా, రౌడీ పదాల్ని తొలిసారి విన్నా. అందుకే, ‘వంగవీటి’అని టైటిల్‌ పెట్టా.

 1482460644_vangaveeti

ఇందులో చూపించినవన్నీ నిజాలేనా? అని ఓ మీడియా మిత్రుడు అడిగితే… దానికి రాంగోపాల్‌ వర్మ నా సమాధానం ఒకటే… నేను నమ్మిన నిజాలను చూపించా. ఉదాహరణకు చలసాని వెంకటరత్నం 72 కత్తిపోట్లతో మరణించాడన్నారు. ‘72 కత్తిపోట్లు పొడిచేవరకూ మనిషి బతుకుతాడా?’అని నేను నమ్మలేదు. వెంకట రత్నాన్ని చంపిన 12 మందిలో ఒకతను అప్పట్లో చంపడానికి వేసిన ప్లాన్‌ ఏమిటో నాతో చెప్పాడు. అప్పుడు నమ్మకం కలిగింది. అతడితో మాట్లాడిన తర్వాత సినిమా ఎలా తీయాలనే స్పష్టత వచ్చింది. ఫస్ట్‌ కాపీ చూసినప్పుడు సినిమా చాలా వయొలెంట్‌గా తీశాననిపించింది. ఒక్క దేవినేని మురళిని చంపేసీనే పావుగంట ఉంటుంది.

దాసరి కిరణ్‌కుమార్‌ ‘డబ్బులు ఖర్చుపెడితే చాలు’అనుకునే నిర్మాత కాదు. ఈ సినిమా కోసం నాకంటే అతను పడిన కష్టమే ఎక్కువ. షూటింగ్‌ కోసం మూడు రోజుల్లో 75 అంబాసిడర్‌ కార్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంబాసిడర్‌ కార్లు ఎక్కడా లేవు. ఎలా ఏర్పాటు చేశాడని నేనే ఆశ్చర్యపోయా.

నేను పవన్‌కళ్యాన్‌ వీరాభిమానిని అని రాంగోపాల్‌ వర్మ అన్నారు. పవన్‌కీ పవనిజమ్‌కీ చాలా తేడా ఉంది. పవనిజమ్‌ అనే దానికి అర్ధమే లేదు. రాము ఇజం మీద నేను 45గంటలు మాట్లాడాను. నాకు తెలిసి పవనిజం మీద పవన్‌కళ్యాన్‌ ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు.

 I like Pawan Kalyan

వ్యక్తిగా పవర్‌స్టార్‌ ఏ అంశంమీదనైన మాట్లాడగలడు. ఇజంకి వ్యక్తికి తేడా ఏంటంటే…..కార్ల్‌మార్క్స్‌ అనేవాడు కమ్యునిజమ్‌పై పుస్తకం రాశాడు. కానీ, తానేం చేయలేదు. అప్పుడప్పుడు పవన్‌కల్యాణ్‌ చేస్తున్నవి చూస్తున్నాను. నా ఉద్దేశంలో పవన్‌కల్యాణ్‌ ఓ నిద్రపోతున్న అగ్ని పర్వతం. ఆ నిద్రలో కూడా మధ్య మధ్యలో అందర్నీ గమనిస్తూ ఉంటాడు. టైమ్‌ వచ్చినప్పుడు అగ్ని పర్వతం పేలుతుంది.

చిరంజీవిగారితో, ఆయన ఇమేజ్‌తో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు. కానీ, ఓ అభిమానిగా ‘బాహుబలి’ కంటే భారీ సినిమాలో ఆయన్ను చూడాలని కోరుకుంటున్నా. నేను ఎక్కువగా రియలిస్టిక్‌ సినిమాలు తీస్తా. ఆయా సినిమాలకు తెలుగులో స్టార్‌ హీరోల ఇమేజ్‌ అవరోధం అవుతుందేమో!

‘నాగార్జునతో ‘క్షణక్షణం–2’, నాతో ‘శివ–2’ తీయ్‌’అని వెంకటేశ్‌ అన్నారు. నేను దర్శకత్వం వహిస్తే ‘శివ–2’ చేస్తానన్నారు నాగార్జున. కానీ, ‘శివ’ సీక్వెల్‌ సాధ్యం కాదు. అప్పటి పరిస్థితులు, విద్యార్థి రాజకీయాలు ఇప్పుడు లేవు. నాగార్జునతో మంచి యాక్షన్‌ ఫిల్మ్‌ తీస్తా. చైతన్య, అఖిల్‌లతో సినిమాలు తీసే ఉద్దేశం లేదు.

 I like Pawan Kalyan

జయలలిత స్నేహితురాలు ‘శశికళ’పై తీయనున్న సినిమా వచ్చే తమిళనాడు ఎన్నికల సమయంలో విడుదల చేయాలనేది ప్లాన్‌. జయలలితతో పోలిస్తే, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఓ పార్టీని, రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వచ్చిన ‘శశికళ’ బయోగ్రఫీ నాకు ఆసక్తి కలిగించింది.

అమితాబ్‌ బచ్చన్‌ ‘సర్కార్‌–3’ షూటింగ్‌ పూర్తయింది. మార్చిలో రిలీజ్‌ చేస్తాం. వచ్చే ఏడాది హాలీవుడ్‌ సినిమా ‘న్యూక్లియర్‌’షూటింగ్‌ ప్రారంభిస్తా. సుమారు ఓ రెండు, మూడేళ్లు ‘న్యూక్లియర్‌’తోనే సరిపోతుందని రాంగోపాల్ వర్మ ఈ సందర్భంగా అన్నారు.

- Advertisement -