మిర్చి భామకి ఆ అనుభవాలు లేవట..!

201
- Advertisement -

రీచా..గుర్తుందిగా..? అదేనండీ..రీచా గంగోపాధ్యాయ్‌. ఇప్పుడు  ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉండటంతో అంత తొందరగా కూడా గుర్తుపట్టలేకపోతున్నారు సినిజనం. లీడర్‌ సినిమాతో గ్లామర్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.  అయితే ఈ అమ్మడుకి యాక్టింగ్‌ స్కిల్స్ అంతగా లేకపోయినా..తన అందచందాలతో ఇటు తెలుగు, అటు తమిళ్‌ లోనూ..క్రేజీ ఆఫర్లు కొట్టేసి తనకంటూ ఫ్యాన్స్‌ ని సంపాధించుకోగలిగింది.
'I have never experienced the casting couch'
అయితే  ఈ భామ మాత్రం  హీరోయిన్‌ గా మాంచి డిమాండ్‌ ఉండగానే..సినిమాలకి గుడ్‌ బై చెప్పేసి లండన్‌ కి చెక్కేసింది. ఐతే.. సినిమాలకి గుడ్‌బై చెప్పినా..ఫ్యాన్స్‌తో మాత్రం టచ్‌ లోనే ఉంటుంది రిచా. రీసెంట్‌గా హాట్ టాపిక్ అయిన కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై రిచా రియాక్ట్ అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీ‌లో హీరోయిన్లకు వేధింపులు వుంటాయని వినడమేకానీ తనకి అలాంటి అనుభవాలు లేవని చెప్పింది. తాను వర్క్ విషయంలో చాలా స్టిక్ట్‌గా వుంటానని, అందుకే అన్ని చిత్రాల్లో నటించినా తనతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది.

ఇలా తన ఒపీనియన్స్‌ని, అనుభవాలను తన ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఇక రీచా మాటలు అలా ఉంటే.. ఆ విషయాలు తెలుసుకున్న వారు మాత్రం… తనతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించనందుకు హ్యాపీగానే ఫీలయ్యి…మరో వైపు ఈ మిర్చీ భామకి ఘాటెక్కువే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదేమైనా..రీచా ఇలాగే ఫ్యాన్స్‌తో టచ్‌ లో  ఉంటూ..తన అభిప్రాయాల్ని తమతో పంచుకోవాలంటూ..ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.

- Advertisement -