నేను క్షేమంగానే ఉన్నా..:స్వామి గౌడ్‌

213
- Advertisement -

గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు ఛైర్మన్ స్వామి గౌడ్‌. దాడులకు దిగడం మంచి సంప్రదాయం కాదని…సభలో సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం మీడియాతో మాట్లాడిన స్వామి గౌడ్‌..తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తనపై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి చంపే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.

గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికి ఉంటుందని కానీ దాడులు చేయడం సరైన పద్దతి కాదన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పేపర్లు, హెడ్ ఫోన్లు విసిరారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనతో సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్లానని చెప్పారు.

I am Ok says Swamy Goud

కాంగ్రెస్ సభ్యలు తీరును చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని మండి పడ్డారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. స్వామి గౌడ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో రాజకీయ భవిష్యత్ ఉండదనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.

- Advertisement -