రకుల్ మారలేదట…!

191
I am not insecure says Rakul
- Advertisement -

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో అందాల తారగా వెలిగిపోతుంది.ఈ అమ్మడు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంటున్న ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్‌తో ముందుకెళుతోంది. దీంతో రకుల్ ఈ మధ్య రెమ్యునరేషన్ పెంచిందనే వార్తలు వెలువడుతున్నాయి. అంతేగాదు జయజానకి నాయక కోసం ఏకంగా డబుల్ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేసిందని దీనికి చిత్ర నిర్మాతలు ఒప్పుకున్నారన్న వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

అయితే, తనకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినందువల్లే ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రెండే కారణాలు. ఒకటి, కథలో నా పాత్ర పెద్దది, బాగా నచ్చింది. ఇక రెండో కారణం, బోయపాటి దర్శకుడు కావడం.. అంతే” అని చెప్పింది రకుల్.

అంతేగాదు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని…. టాలెంట్ ఉన్న వారిని ఇండస్ట్రీ ఎప్పుడు ఆదరిస్తుందని తెలిపారు. ఇక్కడ మంచి వాళ్లతో పాటు చెడ్డ వాళ్లు కూడా ఉన్నారని … ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతారన్నారు.

ప్రస్తుతం మహేష్ సరసన స్పైడర్ మూవీలో నటిస్తున్న  ఈ బ్యూటీ తర్వాత మహేష్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది.  త్వరలో నీరజ్ పాండే దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు  తెలిపింది.

- Advertisement -