మెగా పవర్ స్టార్ రాం చరణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు మధ్య విభేదాలున్నాయని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు రామ్ చరణ్. మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేధాలు లేవన్నారు. మేము మంచి మిత్రులమని మామధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తమపై అసత్యప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్ బాబు నటించిన సినిమాలు విడుదల చేసే సమాయానికే తన సినిమాలను పోటీగా విడుదల చేస్తున్నారనేది అసత్య ప్రచారం అన్నారు. పర్సనల్ గా తమకు అలాంటి ఫిలింగ్స్ ఏమీ లేవన్నారు.
అభిమానులు కూడా హ్యాపిగా ఉండాలన్నారు. హీరోల గురించి అభిమానులు కొట్టుకొవద్దు అన్నారు. ఇటివల విడుదలైన భరత్ అనే నేను, రంగస్ధలం సినిమాలు రెండు సూపర్ డూపర్ హీట్ సాధించాయి. సినిమాల పరంగా ఎ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో మేము ఎప్పుడూ లెక్కించలేదన్నారు. మహేశ్ బాబు నటింటిన భరత్ అనే నేను సినిమా హీట్ కావడం తనకూ ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంగస్ధలం విడుదలైన 20రోజుల తర్వాత భరత్ అనే నేను సినిమా విడుదలయ్యిందని గుర్తు చేశారు.
పర్సనల్ గా హిట్ కొట్టడం కన్నా ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చామన్నా ఆనందంలో ఉన్నామన్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో కొత్త తెర లేపారు హీరోలు. ఇంతకు ముందులా కాకుండా ఒకరి సినిమాకు మరోకరు గెస్ట్ గా వెళ్లడంతో వారి మధ్య మరింత సన్నిహిత్యం పెరుగుతుంది. అంతేకాకుండా వారందరు కలిసి బయట ఫంక్షన్ లలో ఎంజాయ్ చేస్తుండటంతో అభిమానుల ఆనందంతో మునిగిపోతున్నారు. రామ్ చరణ్ తరువాత సినిమా బోయపాటి శ్రీను తో నటించనున్నారు.