కామెడీయన్ కి బ్రేక్ ఇచ్చిన ‘ధమాకా’

48434
- Advertisement -

బుల్లితెర నుండి వచ్చిన కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా సక్సెస్ కాలేదు. వారికున్న క్రేజ్ కి సరైన కేరెక్టర్, పంచులు పడితే మాత్రం సినిమాను మోయగలిగే సత్తా స్మాల్ స్క్రీన్ కమెడియన్స్ సొంతం. తాజాగా హైపర్ ఆది కేరెక్టర్ ధమాకా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాలో హైపర్ ఆదిని రైటర్ ప్రసన్న, త్రినాద్ రావు నక్కిన పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఒకే రోజు, ఒక సన్నివేశం కోసం ఆదిని సెట్ కి పిలిచి ఆ పంచ్ పేలడంతో వెంటనే కేరెక్టర్ ని పొడగించి రావు రమేష్ పక్కన త్రూ అవుట్ ఉండే పాత్ర ను అక్కడికక్కడే డిజైన్ చేశారు.

దీంతో రవితేజ సినిమాలో రావు రమేష్ రమేష్ తో ఉంటూ పంచులు పేల్చే కేరెక్టర్ తో హైపర్ ఆది చెలరేగిపోయాడు. ఎప్పటికప్పుడు తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు ఆది. క్లైమాక్స్ తర్వాత ఎండ్ టైటిల్స్ లో రవితేజ ఆది గురించి రావు రమేష్ తో చెప్పే ఓ కామెడీ డైలాగ్ విపరీతంగా పెలిందంటే దానికి ఆది కేరెక్టరే కారణం.

ఏదేమైనా అప్పుడెప్పుడో వెంకీ అట్లూరి హైపర్ అదిని తొలి ప్రేమ సినిమాలో వాడుకొని మంచి ఎంటర్టైన్ మెంట్ అందించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి హైపర్ ఆది పంచులను పర్ఫెక్ట్ వాడుకుంది పసన్న, త్రినాద్ రావు లే. ధమాకా సక్సెస్ తో ఆదికి రావలసిన బ్రేక్ వచ్చినట్టే. ఈ సక్సెస్ తో బుల్లితెరకి గ్యాప్ ఇచ్చి వెండితెరపై ఆది కమెడియన్ గా బిజీ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి…

లేడీ నిర్మాతతో కుర్ర హీరో పెళ్లి?

‘ఖుషి’ బిహైండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ

సంక్రాంతి పెద్ద పండగ:శేఖర్‌మాస్టర్‌

- Advertisement -