నాగబాబుపై హైపర్ ఆది సెటైర్లు..!

500
nagababu
- Advertisement -

మెగా ఫ్యామిలీకి వీరవిధేయుడిగా ఉండే హైపర్ ఆది…..మెగా బ్రదర్ నాగబాబుపై పంచ్‌లు విసిరాడు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చి అదిరింది షోకి జడ్జ్‌గా చేస్తున్న నాగబాబుపై సెటైర్లు వేశారు.

జబర్దస్త్ స్కిట్‌లో భాగంగా నాగబాబుపై ఆది వేసిన పంచులకు రోజా నవ్వు ఆపుకోలేకపోయారు. దొంగ ఇంటిని మొత్తం దోసుకెళ్తుంటే.. ఆ తీసుకుని వెళ్లరా.. మమ్మల్ని, యాంకర్లని, జడ్జిలను తీసుకెళ్లి నువ్వు కూడా కుదిరింది అని ఓ షో పెట్టుకో అంటూ అదిరింది షోపైనా.. ఆ షోకి జడ్జిగా ఉన్న నాగబాబుపైనా డైరెక్ట్ పంచ్ వేశారు.

నిన్నటి వరకూ నాగబాబుపై ఎంతో వీరాభిమానం ప్రదర్శించిన ఆది.. ఆయన బయటకు వెళ్లగానే ఇలా రివర్స్ పంచ్‌లు వేయడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదిపై ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -