నాలా ఆక్రమిస్తే..కూల్చివేతలే!

1
- Advertisement -

నాలా ఆక్రమించి నిర్మించినట్లు తేలితే..హర్ష డీలక్స్ మెస్ బిల్డింగ్ ను కూల్చేస్తాం అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ‘హర్ష డీలక్స్ మెస్’ ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారన్నారు.

ప్రాథమిక పరిశీలనలో ఈ బిల్డింగ్ కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని స్పష్టమైంది అన్నారు. అత్యవసర సమయాల్లో బయటపడటానికి ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఒక్కటే ఉన్నాయని… భవనం చుట్టూ ఉండాల్సిన సెట్ బ్యాక్ కూడా వదల్లేదని అధికారులు గుర్తించారు అన్నారు.

ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

ALso Read:గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!

- Advertisement -