- Advertisement -
కబ్జా భూములను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లిలో పర్యటించిన రంగనాథ్.. శంషాబాద్ మున్సిపల్ పట్టణ పరిధి తోండుపల్లిలోని సర్వేనెంబర్ 108 లో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్ వెంచర్ చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది.
దీంతో స్థానికంగా పర్యటించిన రంగనాథ్.. ప్రభుత్వ భూమిలో అక్రమ లేఔట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని క్రిమినల్ కేస్ చేస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని సూచించారు. గొల్లపల్లి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న స్మశానంలో అక్రమ బోర్డింగ్ కూడా తొలగిస్తామన్నారు. గతంలో కూడా శంషాబాద్ మున్సిపాలిటీలో కొన్ని ప్రభుత్వ భూములను పర్యవేక్షించామని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read:దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం..
- Advertisement -