ఈటలకు హైడ్రా కమిషనర్ కౌంటర్

7
- Advertisement -

బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కౌంటర్ ఇచ్చారు. బాచుపల్లి తహశీల్దార్ ఇచ్చిన నోటీసులతో.. హైడ్రాకు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు.

బాచుపల్లి తహశీల్దార్ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు అన్నారు. ప్రతీ నోటీస్‌ను, కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తూ.. ప్రజలను ఆందోళన, భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అన్నారు.

కబ్జాదారుల పట్ల హైడ్రా కఠినంగా ఉంటుందని… ఈటల వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి అన్నారు. 2024 జులైకి ముందుకట్టిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు… అనుమతులు ఉన్న వాణిజ్య సముదాయాలను హైడ్రా తొలగించదు అన్నారు.

Also Read:ఎండలతో జాగ్రత్త..వడదెబ్బతో నలుగురు మృతి

- Advertisement -