కార్మికుల పక్షపాతి నాయిని: కేటీఆర్

6
- Advertisement -

నాయిని నర్సింహారెడ్డి ది చిన్నపిల్లాడి మనస్సు… అందరితో కలిసి పోయే వ్యక్తిత్వం నాయిని నర్సింహారెడ్డిది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఓ వైపు బాధ ఉన్న ఆయన్ను గుర్తు చేసుకోకుండా ఉండలేము… నాయిని నరసింహారెడ్డి యెన్నో చోట్ల కలిసి తిరిగాము అన్నారు. రైల్వే కేసుల్లో తొలి హోమ్ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు కేసులన్నీ ఎత్తేశారు అన్నారు.

సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు కేసులు ఎత్తేశారు… కార్మిక శాఖ మంత్రిగా నాయిని కార్మికుల పక్షపాతిగా నిలిచిపోయారు అన్నారు. కార్మికుల పక్షాన నిరంతరం నిలబడ్డ వ్యక్తి…. సోషలిస్టు ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి నాయిని అన్నారు.

Ghmc ఎన్నికల్లో కూడా గట్టిగ పోరాడిన వ్యక్తి… ఎత్తుకున్న జెండా వదలకుండా గట్టిగ నిలబడ్డ వ్యక్తి అన్నారు. కేసిఆర్ కు సొంత అన్నలా నాయిని నర్సింహారెడ్డి నిలిచాడు… హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జి పేరును నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టుకున్నాం అన్నారు. నాయిని నర్సింహారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం… తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరోసారి అయ్యే వరకు మళ్ళీ మనమందరం పోరాడుదాం అన్నారు.

Also Read:ఎండలతో జాగ్రత్త..వడదెబ్బతో నలుగురు మృతి

- Advertisement -