నిజాయితీని చాటుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్..

42
- Advertisement -

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు. ఇవాళ మలక్‌పేట ట్రాఫిక్ WPC G.మమత (4898) మరియు హోమ్ గార్డ్ A. దాసు. (1890) ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న క్రమంలో దిల్సుక్‌నగర్ ట్రాఫిక్ పాయింట్ సమీపంలో సుమారు 1830 గంటల సమయంలో రోడ్డుపై రూ. 33,000/- నగదు ఉన్న ఒక వాలెట్‌ని కనుగోన్నారు.

వెంటనే మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్నపెక్టర్ కు సమాచారం అందించారు. ఒక గంట తర్వాత యజమానులు వచ్చి పర్స్ కోసం వెతుకుతుండగా WPC మమత గమనించి వారిని పిలిచి 33000/- నగదు ఉన్న పర్సును SHO ట్రాఫిక్ మలక్ పేట సమక్షంలో అందజేసింది. ఆమె చాలా సంతోషంగా ట్రాఫిక్ పోలీసుల నిజాయితీ చర్యను మెచ్చుకుంది. సంఘటనా స్థలంలో ఉన్న ప్రజలు ట్రాఫిక్‌ పోలీసుల తీరును ప్రశంసించారు. డి.శ్రీనివాస్ డిసిపి ట్రాఫిక్ 3 ట్రాఫిక్ సిబ్బంది ని ప్రశంసించారు.

Also Read:జగన్ కు ఐప్యాక్ షాక్… నిజమేనా?

- Advertisement -