ఐపీఎల్: టాస్ గెలిచిన సన్ రైజర్స్

88
SunRisers Hyderabad
- Advertisement -

ఐపీఎల్ టోర్నీలో ఈరోజు రసవత్తరమైన మ్యాచ్‌ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ జరుతుంది. ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టు మూడు మార్పులు చేసింది.. వాషింగ్టన్ సుందర్, నటరాజన్, మార్కో జాన్సెన్ స్థానంలో శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, షాన్ అబ్బాట్ జట్టులోకి వచ్చారు. కాగ, ఢిల్లీ జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. పృథ్వీ షా, అక్షర్ పటేల్, ముస్తాఫిజూర్ రహ్మాన్, సకారియా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు., వారి స్థానంలో ఆన్రిచ్ నోర్జే, మన్ దీప్, రిపల్ పటేల్, ఖలీల్ అహ్మద్ ఆడుతున్నారు.

ఈ మ్యాచ్ సన్ రైజర్స్ కు ఎంతో కీలకం. టోర్నీలో 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించిన సన్ రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న సన్ రైజర్స్… గత రాత్రి చెన్నైపై బెంగళూరు గెలవడంతో ఐదోస్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్ బెర్తు కోసం కనీసం మరో 3 విజయాలు సాధించాల్సి ఉంటుంది. అందుకే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ ను సన్ రైజర్స్ కీలకంగా భావిస్తోంది.

తుది జట్లు :

ఢిల్లీ క్యాపిటల్స్ : మణదీప్ సింగ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, రిపల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, సీన్ అబాట్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి

- Advertisement -