వాతావరణ శాఖ తీపి కబురు!

41
rains
- Advertisement -

ఎండవేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ నెల 9, 10 తేదీల్లో నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. వాస్తవానికి గతేడాది జూన్‌ 6న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా ఈసారి మూడు నాలుగు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు.

ఈ నెల 9వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల వచ్చే అవకాశం ఉందన్నారు. 11వ తేదీ వరకు సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రైతులు వర్షాలు కురుస్తున్నాయని విత్తనాలు వేసుకోవద్దని సూచించారు.

మధ్య ప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా మంగళవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయన్నారు. సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తున్నాయని తెలిపారు.

- Advertisement -