సినిమా హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి తలసాని

100
tollywood

సినిమా హబ్‌గా హైదరాబాద్‌ను తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లో సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5 వ ఆట ప్రదర్శనకు అనుమతుల మంజూరు, లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిద రకాల పన్నులను రద్దు చేయటం, ఇతర తదితర అంశాలపై సమావేశంలో చర్చిచారు.

సింగిల్ విండో సిస్టం ద్వారా షూటింగ్ పర్మిషన్ లు ఇస్తున్నాం అని తెలిపారు తలసాని. ఇప్పుడు ఈ సమావేశంలో జరిగిన అంశాల పై సీఎం కేసీఆర్ తో చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మరో సారి సమావేశం తరువాత వాళ్లకు ఇచ్చే ప్రోత్సాహకాలపై క్లారిటీ వస్తుందన్నారు. 5వ షో కు అనుమతి పై వచ్చే సమావేశంలో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కరెంట్ చార్జీల మాఫీ పై చర్చించాం అని తెలిపిన తలసాని..వచ్చే సమావేశంలో ఎగ్జిబిటర్స్ కు ప్రోత్సహకాలపై నిర్ణయం వెల్లడిస్తామన్నారు.

థియేటర్ల కరంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరామని ఎగ్జిబిటర్ సి.కళ్యాణ్ తెలిపారు. కరెంట్ బిల్లుల మాఫీకి ప్రభుత్వం అంగీకరించిందని….ఎగ్జిబిటర్స్ మిగతా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని సి కళ్యాణ్ వెల్లడించారు.