- Advertisement -
నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉపరితలద్రోణి వ్యాపించి ఉండటంతో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, మల్లాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కోంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్, షాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో రోడ్లపై పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
కూకట్‌పల్లి, మల్లాపూర్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలుచోట్ల హోర్డింగ్‌లు నేలకొరిగాయి. యూసఫ్‌గూడలోని శ్రీకృష్ణానగర్ పరిధిలో పలు కాలనీల్లోకి భారీగా వర్షపునీరు పోటెత్తడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
- Advertisement -