హైదరాబాద్‌లో వన్‌ ప్లస్ స్టోర్..

242
hyderabad one plus store

చైనా స్మార్ట్‌ఫోన్‌​ దిగ్గజ బ్రాండ్‌ వన్‌ప్లస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనుంది. బెంగళూరులో మంగళవారం రెండు స్మార్ట్ ఫోన్లు వన ప్లస్ 7,7 ప్రొ ఆవిష్కరణ కార్యక్రమంలో అఫిషియల్‌గా ప్రకటించింది. దీంతో పాటు పుణే,ముంబైలలో రెండు ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను ప్రారంభించనట్లు తెలిపింది.

హైదరాబాద్ గొప్ప సాంస్కృతిక కేంద్రంగానే కాకుండా ఐటీ,టెక్నాలజీ హబ్‌గా పేరుందని వన్ ప్లస్ సీఈవో పీట్ లౌ తెలిపారు. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భవనంలో అతిపెద్ద వన్‌ ప్లస్‌ స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తిచేసి ప్రారంభిస్తామని చెప్పారు.

వన్‌ప్లస్‌కు ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ఉంది. పాత కొత్త టెక్నాలజీల మధ్య వారధిగా వన్‌ప్లస్‌ నిలుస్తుందన్నారు పీట్‌. సంప్రదాయ హైదరాబాద్‌ ఎర్ర ఇటుకలతో, దుమ్మును ఆకర్షించని శ్వేత సౌధాన్ని అద్భుతమైన డిజైన్‌, సహజకాంతితో తీర్చిదిద్దునున్నట్టు పీట్ లౌ వెల్లడించారు.