హైదరాబాద్‌..సేఫ్ సిటీ

266
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహానగరంలో విపత్తులు,ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయ చర్యలు చేపట్టే డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ దేశంలో ఇలాంటి ప్రత్యేక ఫోర్స్ ఉన్న పాలక సంస్థ జీహెచ్‌ఎంసీ మాత్రమేనని తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని…నగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు మరో లక్ష కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ktr

రవీంద్రభారతిలో ముస్కులర్ డిస్టోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న షేక్ నాఫిస్ అనే చిత్రకారిణి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న షేక్ నాఫిస్‌కు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అరుదైన వ్యాధి ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన చిత్రకళను కొనసాగిస్తున్న నాఫిస్ కి మంత్రి అభినందనలు తెలిపారు. నాఫిస్ మంత్రి కేటీ రామారావుకు ఆయన స్వీయ చిత్రాన్ని బహుకరించారు.

ktr ravindra bharathi

- Advertisement -