కేటీఆర్‌కు సుబ్బరాజు సర్‌ప్రైజ్‌

251
ktr subbaraju
- Advertisement -

నటుడు సుబ్బరాజు మంత్రి కేటీఆర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఫ్యామిలీ పంక్షన్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ని కలిసిన సుబ్బరాజు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళమిచ్చారు. మంచి మనసుతో స్పందించినందుకు థ్యాంక్స్ అంటూ ప్రశంసించారు కేటీఆర్.

ఇటీవలె అర్జున్ రెడ్డి సినిమాకు అందుకున్న ఫిల్మ్‌ఫేర్‌ను అందుకున్న విజయ్‌ దేవరకొండ దాన్ని వేలం వేసి రూ. 25 లక్షలను సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళంగా ఇచ్చారు. తాజాగా సుబ్బరాజు సైతం సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం అందజేశారు. సుబ్బరాజుకు చెక్ ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. సినిమాల్లో నెగటివ్ పాత్రల్లో కనిపిస్తుండొచ్చు కానీ నిజ జీవితంలో రియల్ హీరో అంటూ పొగడ్తలు ముంచెత్తారు.

బాహుబ‌లి2 చిత్రంలో కుమార వ‌ర్మ పాత్ర పోషించి అందరిని అల‌రించారు సుబ్బ‌రాజు . సినిమా మొద‌ట్లో అమాయకంగా క‌నిపించి చివ‌రిలో ధైర్యంగా పోరాడ‌డం అక్క‌డి ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో రజనీకాంత్ తర్వాత జ‌ప‌నీస్ ప్రేక్ష‌కులను ఆకట్టుకున్న నటుడిగా నిలిచారు సుబ్బరాజు.

- Advertisement -