హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం..

324
Hyderabad receives heavy rainfall, thunderstorm
- Advertisement -

గ‌త కొద్ది రోజ‌లుగా దంచికొండుతున్న ఎండ‌ల నుంచి హైద‌రాబాద్ వాసులకు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో భారీ ఇదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తుంది. దక్షిణ క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌రకు విస్త‌రించిన ఉప‌రితల ద్రోణి ప్ర‌భావంతో ప‌లుచోట్ల భారీ వ‌ర్షం ప‌డుతోంది. వ‌ర్షం కార‌ణంగా హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని రాంన‌గ‌ర్, బంజార‌హిల్స్ , జూబ్లిహిల్స్ , అమీర్ పేట్, కూక‌ట్ పల్లి, సికింద్రాబాద్, రామంతాపూర్ ప‌లు ప్రాంతాల్లో ఈదురుగాలుల‌తో కూడిన కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. వ‌ర్షం భారీగా ప‌డుతండ‌టంతో న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

Hyderabad receives heavy rainfall, thunderstorm

కోఠీ, నాంపల్లి, మెహదీపట్నం, మలక్ పేట, పాతబస్తీతోపాటు మేడ్చల్ జిల్లాలోని కీసర, నాగారం, దమ్మాయిగూడ, కుషాయిగూడ, ఈసీఐఎల్, ఏ.ఎస్.రావు నగర్, కాప్రా, నెరేడిమెట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బాలాపూర్ మండలం లోని మీర్ పేట, జిల్లెలగూడ,అల్మాస్ గూడ,బడంగ్ పేట లో కుండబోత వర్షం పడుతోంది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -