- Advertisement -
హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ తరహాలో డ్రగ్ టెస్ట్‌లు చేసేందుకు పోలీసులు సిద్దమౌతున్నారు. అయితే ఇప్పటికే కేరళ, గుజరాత్‌లో ప్రయోగం సక్సెస్ అయిందని పోలీసుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్ టెస్ట్‌ల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు ప్రారంభించారు.
ఈ టెస్ట్ లాలాజలంతో చేస్తారు. టెస్ట్ ఫలితాలు 2 నిమిషాల్లో వస్తుంది. లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్ పరీక్షలు చేయనున్నారు. డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లు ఉపయోగిస్తారు. గంజాయి, హష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను డ్రగ్ అనలైజర్ల ద్వారా గుర్తిస్తారు. టెస్టుల ఫలితాలను హైదరాబాద్ కాప్స్ అధ్యయనం చేయనున్నారు.
- Advertisement -