దేశంలో బెస్ట్ పోలీస్‌గా హైదరాబాద్ పోలీస్

133
anjani kumar
- Advertisement -

దేశంలోనే బెస్ట్ పోలీస్‌గా హైదరాబాద్‌ పోలీసులు నిలిచారని వెల్లడించారు సీపీ అంజన్ కుమార్ యాదవ్. భారత విదేశాంగశాఖ అర్ధవార్షిక రివ్యూలో తెలంగాణ,హైదరాబాద్‌ను బెస్ట్ యూనిట్‌గా ప్రకటించాయని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను వేగంగా నిర్వహించారని…వారందరికి అభినందనలు తెలిపారు సీపీ.

ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన సీపీ.. జూన్‌ 26 వరకు 48,295 పాస్‌పోర్ట్‌ దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేశామన్నారు. ఒక్కో పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ కోసం సగటున నాలుగు రోజుల సమయం మాత్రమే పట్టిందని…కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సమిష్టి కృషితోనే ఇది సాధించగలిగామన్నారు.

- Advertisement -