నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల నిఘా

1
- Advertisement -

నకిలీ రిజిస్ట్రేషన్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. గత వారంలోనే ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పౌరుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

గత వారంలో జూబ్లీహిల్స్, మలక్‌పేట్, బేగంబజార్, అబిడ్స్ మరియు కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేశారు.

ఇలాంటి ఉల్లంఘనలు పెరుగుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) మాత్రమే చట్టబద్ధమైనవని స్పష్టం చేశారు. ఫ్యాన్సీ డిజైన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు, అంకెలను మార్చడం లేదా తీసివేయడం, మరియు రిజిస్ట్రేషన్ ప్లేట్లకు బదులుగా తాత్కాలిక స్టిక్కర్లను ఉపయోగించడం నిషేధించబడిందని చెప్పారు.

Also Read:CJP ఎఫెక్ట్..18 మెట్రో స్టేషన్లు క్లోజ్!

వాహనాల రిజిస్ట్రేషన్లలో జరిగే మోసపూరిత చర్యలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదు) విధానాన్ని అమలు చేస్తున్నారు. నకిలీ లేదా మార్పిడి చేసిన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగిస్తే తీవ్రమైన చట్టపరమైన పర్యవసానాలు ఉంటాయని, క్రిమినల్ కేసులతో పాటు వాహనాన్ని వెంటనే స్వాధీనం చేసుకుంటామని పౌరులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అని జోయల్ డేవిస్ తెలిపారు.

- Advertisement -