అంతర్జాతీయ డ్రగ్ ముఠా అరెస్ట్

261
- Advertisement -

నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఎన్‌సీబీ అధికారులు డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన సైంటిస్ట్ వెంకటరమణ, రవి శంకర్‌లను అరెస్టు చేశారు. రూ.45 కోట్ల విలువైన అంఫెటామైన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారం కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తూ నిందితులు దొరికిపోయారు.

డయేరియాకు మందు పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రముఖ సంస్థలో పరిశోధక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వెంకట రమణ (37), రవిశంకర్ రావు (22) నుంచి డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకున్నారు. కాగా, వారి వద్ద ఆ సమయంలో ఉన్న దాదాపు 221 కిలోల యాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. తన ఇంట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నాయని విచారణలో రామారావు వెల్లడించాడు. బెంగళూరులోని అతడి ఇంటిని గాలించగా.. వెంకట రామారావు భార్య ప్రీతి (35) మరో 30 కిలోల యాంఫెటమైన్‌ను దాచి ఉంచినట్లు తేలింది.

డ్రగ్స్ వ్యాపారంలో వెంకట రామణకు ఆయన భార్య కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్‌ను ఎక్కువగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు భారతదేశం నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఓ భారీ డ్రగ్ నెట్‌వర్క్ నడుస్తోందని వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -