సెప్టెంబర్‌ 7 నుండి హైదరాబాద్ మెట్రో పరుగులు…

205
hyderabad metro
- Advertisement -

అన్ లాక్ 4.0లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7 నుండి మెట్రో రైళ్లు నడవనుండగా భాగ్యనగరంలో కూడా మెట్రో పరుగులు పెట్టనుంది.

కొన్ని నిబంధనలు విధిస్తూ మెట్రో సర్వీసులు నడిపేందుకు కేంద్రం పచ్చజెండా ఉపింది. గతంలో ఒక్కో ట్రైన్లో వెయ్యి మంది వరకు ప్రయాణం సాగించేవారు.కానీ, ఈ సంఖ్యను కూడా పరిమితం చేయనున్నారు.

గతంలో మెట్రో ట్రైన్ ఫ్లాట్ ఫామ్ వద్ద భారీ సంఖ్యలో ప్రయాణికులు నిలబడేవారు. కానీ, ఈసారి నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఫ్లాట్ ఫామ్ మీదకు కొద్ది మందిని మాత్రమే అనుమతించనున్నారు.

- Advertisement -