మెట్రో రైళ్ల సమయం పెంపు…

251
hmr
- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైల్ సమయాన్ని పెంచారు అధికారులు. ప‌్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా హెచ్‌ఎంఆర్ రైళ్ల రాకపోకల సమయాన్ని నేటి నుండి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండ‌నున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కు మాత్రమే రైళ్ల‌ను న‌డపగా ర‌ద్దీ పెర‌గ‌డంతో రైళ్ల స‌మ‌యాల‌ను మ‌రో అర‌గంట పాటు పొడిగించారు. ప్ర‌తి మూడు నిమిషాల‌కో రైలు అందుబాటులో ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ‌

కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 7న మెట్రో సేవలు తిరిగి ప్రారంభంకాగా తర్వాత మూడు దశల్లో మూడు కారిడార్‌లలో మెట్రో రైళ్లను నడుపుతున్నారు.

- Advertisement -