భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు

228
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గిన దేశీయ మార్కెట్‌లో మాత్రం బంగారం,వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరుగుదలతో రూ.52,220గా ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.740 పెరిగి రూ.47,870కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగి వెండి ధర రూ.62,100కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం తగ్గుదలతో 1908 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.58 శాతం క్షీణతతో 24.43 డాలర్లకు చేరింది.

- Advertisement -