- Advertisement -
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ లు సిద్ధం అయ్యాయి. రూ.19 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్ లు సిద్ధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్ గా చేపట్టేలా డీపీఆర్ డిజైన్ చేశారు.
మూడు మార్గాల్లో 86.5 కి. మీ మేర ప్రతిపాదించారు. జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్- ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం చేయనున్నారు. డీపీఆర్ లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో రహదారి, సెకండ్ ఫ్లోర్ లో మెట్రో ప్రతిపాదనకు గతంలో HAML విముఖత చెప్పిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదనలో డబుల్ డెక్ లేకుండా హకీంపేట్ రన్ వే నుంచి ఎలైన్మెంట్ రెడీ చేయగా సీఎం ప్రణాళికకు అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నారు.
Also Read:TTD:అన్నమయ్య సామాజిక కవి
- Advertisement -

