మన మెట్రో…మన అమ్మాయిలు

209
Hyderabad metro Experiments by L&T

భాగ్య‌న‌గ‌ర వాసుల‌ ట్రాఫిక్ కష్టాలు తీర్చే తొలి ద‌శ మెట్రో ప‌రుగుకు ముహూర్తం ఖ‌రారైన సంగతి తెలిసిందే.  తొలి ద‌శలో నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు 30 కిలోమీట‌ర్ల దూరం ప్రారంభంకానుంది. న‌వంబ‌ర్‌ 28వ తేదీన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ప్రాజెక్టును అత్యాధానుకి హంగులతో తీర్చిదిద్దనున్నారు. ప్రపంచస్ధాయి ప్రమాణాలతో  హైదరాబాద్ మెట్రోను నిర్మిస్తున్నారు. రోజువారీ రైల్ సర్వీసులు నడపటానికి 100 మంది లోకో పైలట్స్(డ్రైవర్స్)ను నియమించారు. వీరిలో 35 మంది మహిళలు కావటం విశేషం. 18 నెలలుగా వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు.

Hyderabad metro Experiments by L&T
మెట్రో రైలు నడుపుతున్న 35 మంది మహిళల్లో అందరూ కూడా  రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినవారే కావటం విశేషం. అవకాశాలను అందిపుచ్చుకోవటంలో నేటి మహిళలు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. మెట్రోలో ప్రయాణించటమే కల అనుకుంటే.. ఆ రైలును నడిపే అవకాశం రావటం ఎంతో అద్భుతంగా ఫీలవుతున్నట్లు చెబుతోంది వరంగల్ కు చెందిన కె.సింధుజ.  ట్రయిల్ రన్ లోనే 8వేల కిలోమీటర్లు మెట్రో రైలును నడిపనట్లు తెలిపింది.

సాంకేతికంగా ఎప్పకటికప్పుడు ప్రత్యేక శిక్షణ ద్వారా  అప్ డేట్ అవుతున్నామని మహబూబ్ నగర్‌కు చెందిన వెన్నెల చెబుతోంది. ఇలాంటి జాబ్ చేయడం మహిళలకు ఛాలెంజింగ్ తోపాటు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు ట్రైనింగ్ తీసుకుంటున్న లోకో పైలట్స్‌. మొత్తంగా అత్యాధునిక హంగులతో తెరకెక్కుతున్న హైదరాబాద్‌ మెట్రోలో మహిళా డ్రైవర్లకు ప్రాతినిధ్యం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.