- Advertisement -
ఈ నెల 10, 11వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరంలో ఈ కారు రేసింగ్ జరగనుంది. శని ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ మింట్ కంపౌండ్ ఐమ్యాక్స్ వరకు లీగ్ కొనసాగనుంది. ఈ మేరకు ఎన్టీఆర్ మార్గ్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 11వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీంతో ట్యాంక్ బాండ్ ఎన్టీఆర్ మార్గ్ ఐమ్యాక్స్ థియేటర్‌వైపు వచ్చే వహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ మార్గాల్లో నోఎంట్రీ..
- వీవీ విగ్రహం (ఖైరతాబాద్) వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదన్ కాలేజ్, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
- బుద్ధభవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
- రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తల్లిజంక్షన్, ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లైఓవర్ పైనుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
- ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
- బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్‌మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కంపౌండ్ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఖైరతాబాద్ బడా గణేష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లైన్‌లోకి మళ్లిస్తారు.
ఇవి కూడా చదవండి…
- Advertisement -