- Advertisement -
కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడంతో దేశీయ మార్కెట్లలో కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి రూ.48,860కు చేరింది.
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.53,290కి చేరగా బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.1,450 పెరిగి కిలో వెండి ధర రూ.67,050కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1940 డాలర్లకు చేరితే.. వెండి ధర ఔన్స్‌కు 0.82 శాతం పెరుగుదలతో 27.09 డాలర్లుగా ఉంది.
- Advertisement -