గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం..

14
- Advertisement -

హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ తో పాటు GHMC పరిధిలోని 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం అయ్యాయి. 13 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు 30 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా సర్వైలెన్స్, డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు.

హుస్సేన్ సాగర్ లో 9 బూట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బంది నియమించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 303 కి.మీ మేర 50 వేల విగ్రహాల శోభాయాత్రలు జరుగుతాయని అంచనా వేశారు.

Also Read:‘మదరాసి’.. క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌

 

ఇక ఇవాళ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు గణనాథుడిని దర్శించుకోనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, సురేఖ.

- Advertisement -