ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో కన్నుమూశారు అర్మానీ. ఆయనకు చెందిన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తున్నట్లు సమాచారం.
అర్మానీ… కింగ్ జార్జియోగా గుర్తింపు పొందారు. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. ఇది కంపెనీ కాదు. ఒక కుటుంబంలా భావిస్తాం. దార్శనికత, అభిరుచి, అంకితభావంతో కంపెనీని స్థాపించిన వ్యక్తి ఇక లేరనే బాధను జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన నింపిన స్ఫూర్తితో పని చేస్తాము. ఆయన నిర్మించిన కంపెనీని.. ఆయన జ్ఞాపకార్థం, గౌరవం, బాధ్యత, ప్రేమతో ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాము అని అర్మానీ గ్రూప్ వెల్లడించింది.
1934లో ఉత్తర ఇటలీలోని పియాసెంజాలో అర్మానీ జన్మించారు. 1957 వరకు ఫ్యాషన్‌పై వృత్తిపరమైన ఆసక్తి చూపించలేదు. మెడిసిన్ చదివారు. ఆ తర్వాత సైన్యంలో చేరారు. అనంతరం మిలాన్‌లోని చరిత్రాత్మక లా రినాస్సెంట్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో విండో డ్రస్సర్‌గా ఉద్యోగం పొందారు. అలా ఇటలీ ఫ్యాషన్ రాజధానితో ఆయనకు అనుబంధం ప్రారంభమైంది.
Also Read:‘మదరాసి’.. క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్

