- Advertisement -
నూతన సంవత్సరం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాదాపూర్ ఐటీ కారిడార్‌లోని ఫ్లై ఓవర్‌లు మూసివేశారు. సైబర్ టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని… అత్యవసర సమయాల్లో 9490617346 నంబర్‌కు వాట్సప్ ద్వారా సందేశాలు పంపించాలని సూచించారు.
- Advertisement -