చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి…

376
chepa-prasadam
- Advertisement -

ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8న ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం ఇస్తామన్నారు బత్తిన హరినాథ్ గౌడ్. ఆ రోజు రాలేకపోయినవారికి మరో రెండు రోజుల పాటు ఇంటిదగ్గర చేప ప్రసాదాన్ని ఇస్తామన్నారు.

All set for Bathini Brothers Fish prasadam

చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్స్, బారికేడ్స్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లడ్ లైట్స్, సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో చలువ పందిళ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం కోసం మత్స్యశాఖ ద్వారా చేప పిల్లలను అందిస్తోంది ప్రభుత్వం. ఈసారి కూడా లక్షల్లో ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది.

- Advertisement -