ఆర్టీసీ డ్రైవర్ పైదాడి..సజ్జనార్ వార్నింగ్

5
- Advertisement -

ఆర్టీసీ డ్రైవర్ పైదాడి నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బంది సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం అని తెలిపారు సజ్జనార్. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది… పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి అన్నారు.

Also Read:TTD:సింహ వాహనంపై సిరులతల్లి

- Advertisement -