ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్) అనే యాక్షన్ ప్లాన్‌ను చేపడుతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జంట నగరాల్లో ప్రధానమైన సమస్యగా ట్రాఫిక్ ఉందన్నారు. దీనిపై మరింత ఫోకస్ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్కింగ్, ఫుట్‌పాత్ ఆక్రమణలపై మరింత శ్రద్ధ వహిస్తామని తెలిపారు. మల్టిప్లెక్స్ మాల్స్‌లో 60శాతం, కమర్షియల్ బిల్డింగ్స్‌లో 40శాతం, అపార్ట్‌మెంట్‌లో30శాతం పార్కింగ్ ఉండాలన్నారు. ఫుట్‌పాత్‌లు వదిలేసి రోడ్లపైకి వచ్చి బిజినెస్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
స్టాప్ లైన్‌ను నియంత్రణ అందరికీ అలవాటు అవ్వాలన్న సీపీ…ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్లలో ముందు సీట్లలోని వారే కాకుండా బ్యాక్ సీటర్‌లు కూడా సీట్‌బెల్ట్ పెట్టుకునే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రజలకు ట్రాఫ్రిక్ ఫ్రీ అనుభూతి కలగేలా చేస్తామన్నారు. కరోనా వచ్చాక జంటనగరాల్లో వాహనాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు.
ఆర్టీసీ బస్సులకు సంబంధించి బస్‌బేల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తాం. ఎన్‌ఫోర్స్‌మెంట్ లో భాగంగా ట్రాఫిక్ పై దృష్టి పెడతామన్నారు. జాయింట్ సీపీలు, డీసీపీలు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడాదిలోగా అనుకున్న ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ అర్థం చేసుకొని ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలి, ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎలాంటి నిర్మాణాలనైనా త్వరలో తొలిగించేలా చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ తెలిపారు.