బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్లు విక్ర‌యిస్తున్న ముఠా అరెస్ట్.. 36 ఇంజెక్షన్స్ సీజ్..

226
CP Anjani Kumar
- Advertisement -

సికింద్రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్లు విక్ర‌యిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాంగోపాల్‌పేట్‌లో అధిక ధ‌ర‌కు ఇంజెక్ష‌న్ల‌ను అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 35 అంఫోటెరిసిన్ -బీ ఇంజెక్ష‌న్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ‌త కొద్ది రోజుల నుంచి హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల‌ను ప‌లువురు బ్లాక్‌లో విక్ర‌యిస్తున్న విష‌యం విదిత‌మే. ఇలాంటి ముఠాల‌పై పోలీసులు నిఘా పెట్టి.. వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ సందర్బంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్‌లో అక్రమంగా బ్లాక్ ఫంగస్ ఇంజక్షషన్స్ అమ్ముతున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ అక్రమ వ్యాపారంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. 8వేల ధర ఉన్న ఇంజెక్షన్స్ ను 50వేల వరకు అమ్ముతున్నారు. పోలీసుల ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. వారి వద్ద నుండి 36 ఇంజెక్షన్స్ సీజ్ చేశామని తెలిపారు.

నిందితులు క్రాంతి కుమార్, వెంకట్ దినేష్, శ్రీనివాస్‌గా గుర్తించారు. హైదరాబాద్ సీపీ పరిధిలో బ్లాక్ ఫంగస్‌పై 58 కేసులు బుక్ కాగా.. 138 అరెస్ట్, 450 ఇంజెక్షన్స్ సీజ్ చేశాం. ఫంగస్ అక్రమ దందాపై 9490616555 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -