ఢిల్లీపై హైదరాబాద్ సూపర్ విక్టరీ..

319
srh
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని నమోదుచేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఢిల్లీపై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది హైదరాబాద్.

భారీ లక్ష్యం కావడంతో ఆరంభంలోనే తడబాటు పడ్డారు ఢిల్లీ ఆటగాళ్లు. ఓపెనర్ శిఖర్ ధావన్ 0,స్టాయినిస్ 5,హెట్ మెయిర్ 16,శ్రేయాస్ అయ్యర్ 7,అక్షర్ పటేల్ 1 విఫలం కాగా రహానే 26,పంత్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.

అంతకముందు తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(66: 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా(87: 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) అదరగొట్టారు. చివర్లో మనీశ్‌ పాండే(44నాటౌట్:‌ 31 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది.

- Advertisement -